Job Vacancies: అమెజాన్ నుంచి డీఆర్‌డీఓ వరకు.. ఈ వారంలో దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే
Job Vacancies: కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు ఈ వారంతో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ పలు జాబ్స్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కంపెనీ దాదాపు 55,000 ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన కొన్ని ఉద్యోగాల వివరాలను చూద్దాం.కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఊపందుకుంటోంది. రానున్న రోజుల్లో కొన్ని ముఖ్యమైన ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు ఈ వారంతో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ పలు జాబ్స్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రిటైల్ దిగ్గజం అమెజాన్(Amazon) కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కంపెనీ దాదాపు 55,000 ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన కొన్ని ఉద్యోగాల వివరాలను చూద్దాం.
Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో 1,295 ఉద్యోగాలకు జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ అయితే చాలుడీఆర్డీఓ నియామకం..
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్(సీఏఐఆర్) లో ఈ నియామక ప్రక్రియ జరగనుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్షన్ నిర్వహించనున్నారు. అక్టోబరు 18, 19వ తేదీల్లో ఈ మౌఖిక పరీక్ష జరుగుతుంది. ఇంటర్వ్యూలో అర్హత పొందిన వారిని తొలుత రెండు సంవత్సరాలు పనిచేసే ఒప్పందంపై నియమించుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబరు 8లోపు jrfcair2021@gmail.com అనే మెయిల్ ఐడీకి అప్లికేషన్ పంపించాలి.RSMSSB రిక్రూట్‌మెంట్..
రాజస్థాన్ సబార్డినేట్ అండ్ మినిస్టీరియల్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (RSMSSB) 250 సంగానక్(కంప్యూటర్) పోస్టులకు నియామకాలు చేపట్టింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్ సైట్(rsmssb.rajasthan.gov.in) ద్వారా అక్టోబరు 8 లోపు దరఖాస్తులను సమర్పించాలి. గణితం లేదా ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండి ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు కంప్యూటర్స్ విభాగంలో డిప్లొమా ఉండాలి.
సీజీపీఎస్సీ రిక్రూట్మెంట్..
చత్తీస్ ఘడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (CGPSC) 595 ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. వీరిని రాష్ట్ర ఉన్నత విద్యా విభాగంలో నియమిస్తారు. సెప్టెంబరు 13 మధ్యాహ్నం 12 నుంచి అధికారిక వెబ్ సైట్ psc.cg.gov.inలో ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులకు పీహెచ్‌డీ డిగ్రీతో పాటు పరిశోధన విభాగంలో 10 ఏళ్ల అనుభవం, వర్క్ రికార్డు ఉండాలి. అక్టోబరు 12 లోపు దరఖాస్తులను పంపాలి.
NHPC నియామకాలు..
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లిమిటెడ్ పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రాజ్ భాష అధికారి, జేఈ(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), సీనియర్ అకౌంటెంట్‌తో పాటు మొత్తం 173 ఖాళీలను భర్తీ చేయనుంది. సెప్టెంబరు 30 లోపు దరఖాస్తులను పంపాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ nhpcindia.com సందర్శించాలి. కంప్యూటర్ ఆధారిత ఆన్ లైన్ టెస్ట్ ద్వారా సెలక్షన్ నిర్వహిస్తారు.
అమెజాన్ కెరీర్ ఫెయిర్..
దిగ్గజ సంస్థ అమెజాన్ సెప్టెంబరు 16న భారత్ లోనే మొట్టమొదటి వర్చువల్ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తోంది. దీని ద్వారా ప్రైవేటు రంగంలో కెరీర్ కోరుకునే వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. కార్పొరేట్, టెక్, ఆపరేషన్స్ రోల్స్ కోసం 55,000 మంది అభ్యర్థులను నియమించుకుంటోంది. ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ఈ కెరీర్ మేళాకు హాజరుకావచ్చు. రెజ్యూమ్ బిల్డింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ చిట్కాలను నేర్చుకోవడానికి కోచింగ్ కూడా అభ్యర్థులకు అందిస్తోంది. ఈ వర్చువల్ కెరీర్ ఫెయిర్ కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే దీనికి అఫిషియల్ డెడ్ లైన్ లేదు.
SPSC రిక్రూట్మెంట్..
సిక్కిం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (SPSC) ఫిషరీస్ బ్లాక్ ఆఫిసర్స్, ఫిషరీస్ గార్డ్స్ నియామకాన్ని చేపట్టింది. అధికారిక పోర్టల్ www.spscskm.gov.in పూర్తి వివరాలు పొందవచ్చు. ఫిషరీస్ బ్లాక్ ఆఫిసర్స్ లో 11 ఖాళీలు, ఫిషరిస్ గార్డ్స్ లో 13 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 15లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Comments
Post a Comment